మా ఊరికి రైడ్‌కు ఎందుకు వచ్చారంటూ పోలీస్‌ను పోల్‌కు కట్టేశారు! | Bihar Cop Tied To Pole And Beaten Up By Gamblers During Raid | Sakshi
Sakshi News home page

మా ఊరికి రైడ్‌కు ఎందుకు వచ్చారంటూ పోలీస్‌ను పోల్‌కు కట్టేశారు!

Published Sun, Nov 7 2021 7:40 PM | Last Updated on Sun, Nov 7 2021 7:54 PM

Bihar Cop Tied To Pole And Beaten Up By Gamblers During Raid - Sakshi

పాట్నా: కొంతమంది దుండగులు తమ ఊరులోకి వచ్చిన ఓ పోలీసును చుట్టుముట్టి దాడి చేశారు. అంతటి ఆగకుండా ఆ పోలీసును ఓ పోల్‌కు కట్టేసి కొడుతూ దర్భాషలాడారు. ఈ ఘటన బీహార్‌లోని మోతీహరి ప్రాంతం సమీపంలోని ధర్మపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామంలో కొంతమంది మద్యం తాగి గొడవ చేస్తున్నారని సమాచారం అందటంతో ఓ పోలీసు ధర్మపూర్‌ గ్రామానికి వెళ్లారు. ఊరిలోకి చేరుకున్న పోలీసును ఒక్కసారిగా కొంతమంది దుండగులు చుట్టుముట్టి పోల్‌కు కట్టేసి దాడి చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు పోలీసును కొడుతూ, దుర్భాషలాడారు. ఈ ఘటనను మరోవ్యక్తి వీడియో తీశాడు.

ఇక్కడ గొడవ జరిగినట్లు మీకు ఎవరు చెప్పారని అడుగుతూ పోలీసును నిలదీశాడు. అదేవిధంగా దీపావళి సందర్భంగా ఎటువంటి గొడవలు ఇక్కడ  జరగవని ఎందుకు తమ ఊరికి రైడ్‌ చేయడానికి వచ్చారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సీసీటీవీ వీడియో ఆధారంగా ఆ పోలీసును సుగైలి పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐగా గుర్తించారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీపీ ఫుటేజ్‌ ఆధారంగా  అనుమానం ఉన్న పలువురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. దీనిపై అన్ని కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement