ముంబయి: శరత్ పవార్ అనుయాయులైన ప్రఫుల్ పటేల్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. షిండే ప్రభుత్వంతో చేతులు కలిపారు. నిన్న రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ అంశంలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ప్రపుల్ పటేల్ దురుసుగా స్పందించారు.
ఈ రోజు ప్రపుల్ పటేల్ అజిత్ పవార్ ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిసినందుకు కేంద్ర మంత్రి పదవి దక్కనుందనే పుకార్లలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇంకా ఢిల్లీకి వెళ్లి మాట్లాడలేదని చెప్పారు. మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి మాత్రమే చర్చించామని స్పష్టం చేశారు.
ఎన్సీపీ పార్టీని, నాయకుడు శరద్ పవార్‌ను వదిలేస్తున్నారా? అనే ప్రశ్నకు ప్రపుల్ పటేల్ కోపం తెచ్చుకున్నారు. కారు అద్దాలను పైకి ఎత్తేశారు. కారును ముందుకు పోనివ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్సీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న ప్రపుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ కూడా అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిశారు.
#WATCH | NCP leader Praful Patel, says "We are the NCP and that is what we are doing. We will decide now if I have to go to Delhi. We have not discussed anything about Delhi, we have only discussed about the formation of our government in Maharashtra" pic.twitter.com/Wp4e3X7RIi
— ANI (@ANI) July 3, 2023
కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment