
The girl is seen in the video Bad Condition Of Kashmir Roads: ఇంతవరకు మనం చూసే వైరల్ వీడియోలు కొన్ని సందేశాత్మకంగానూ, ప్రజలను ఆలోచింప చేసే విధంగానూ ఉన్నాయి. అయితే కొన్ని వైరల్ వీడియోలైతే ఆనంద్ మహీంద్రలాంటి ప్రముఖులను సైతం కదిలించాయి. అచ్చం అలాంటి సందేశాత్మకమైన ఆలోచింప చేసే క్యూట్ వైరల్ వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
అసలు విషయంలోకెళ్తే.. ఈ వైరల్ వీడియోలో ఒక చిన్నపాప రిపోర్టర్‌లా కశ్మీర్‌లో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ప్రజలు ఏవిధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. పైగా ఆ వీడియోలో ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉండటం వల్ల తన ఇంటికి అతిధులు కూడా రాలేకపోతున్నారని చెబుతోంది. అంతేకాదు రిపొర్టర్ మాదిరి చెప్పి చివరిలో కెమెరామెన్ అమ్మతో అని ముగిస్తుంది.
ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కురిసిన సంగతి తెలిసింది. దీంతో రోడ్లు బురదగా మారి అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ మేరకు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.
Meet Youngest reporter from the #Kashmir Valley. pic.twitter.com/4H6mYkiDiI
— Sajid Yousuf Shah (@TheSkandar) January 9, 2022
(చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!)
Comments
Please login to add a commentAdd a comment