Viral Video: Telangana Bride Dancing For Bullettu Bandi Song In Barat - Sakshi
Sakshi News home page

Bullet Bandi Song: వధువు సూపర్‌ డ్యాన్స్‌.. చూస్తూ ఉండిపోయిన భర్త

Published Tue, Aug 17 2021 7:13 PM | Last Updated on Thu, Aug 19 2021 6:16 PM

Viral Video: Telangana Bride Dance In Barat To Song Of Bullettu Bandi - Sakshi

తెలంగాణలో జానపద పాటలు కోకొల్లలు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ పాటలే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఏ వేడుక ఉన్నా జానపదం ఘల్లుమంటోంది. ఆ పాటలు మార్మోగుతున్నాయి. తాజాగా ఓ వధువు తన బరాత్‌లో ఓ జానపద పాటకు సూపర్‌గా డ్యాన్స్‌ చేసి వరుడిని బంధుమిత్రులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిన భర్త అలా చూస్తుండి నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో తెలుగు నేలపై వైరల్‌గా మారింది. అయితే ఆమె ఎవరు? ఎక్కడ డ్యాన్స్‌ చేసిందీ.. ఈ వివరాలు ఏమీ తెలియవు.

‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ పొందింది. రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.

అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. ఈ క్రమంలోనే వివాహ వేడుక అనంతరం తీసిన బరాత్‌లో వధువు ఈ పాటకు డ్యాన్స్‌ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ యువతి డ్యాన్స్‌ చూసి ఆనందించండి.

చదవండి: నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
చదవండి: ‘ట్విటర్‌ పక్షి’ని వండి లాగించేసిన కాంగ్రెస్‌ నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement