Manchu Manoj Met Jambalakidi Jaru Mitaya Singer, Video Viral - Sakshi
Sakshi News home page

Manchu Manoj :  జంపలకడి జారు మిఠాయి సింగర్‌ని కలిసిన మనోజ్‌.. వీడియో వైరల్‌

Published Thu, Nov 24 2022 10:20 AM | Last Updated on Thu, Nov 24 2022 11:38 AM

Manchu Manoj Meets Jambalakidi Jaru Mitaya Singer Video Goes Viral - Sakshi

జంపలకడి జారు మిఠాయా.. సోషల్‌ మీడియా ఫాలో అవుతున్న వారికి ఈ సాంగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జిన్నా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సింగర్‌ భారతమ్మ పాడిన ఈ పాట నెట్టింట ఎంతగానో వైరల్‌ అయ్యింది. సాధారణంగానే సినిమా పాటలకు, జానపథ పాటలకు ఎంతో తేడా ఉంటుంది. ఈ మధ్యకాంలో జానపథ పాటలకు ఆడియెన్స్‌లోనూ మంచి రెస్పాన్స్‌ కనిపిస్తుంది.

ఇక జిన్నా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మోహన్‌ బాబు స్వయంగా సింగర్‌ భారతమ్మని పరిచయం చేయడమే కాకుండా స్టేజి మీదకి పిలిచి ఆవిడ మా ఊరి నుంచి వచ్చారు పాట పాడతారు అంటూ ఎంకరేజ్‌ చేశారు. ఇక జంపలకడి జారు మిఠాయి.. అంటూ భారతమ్మ పాడిన ఈ సాంగ్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. మరోవైపు ట్రోల్స్‌ కూడా అదే రేంజ్‌లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

రీసెంట్‌గా ఈ సాంగ్‌కు రీమిక్స్‌ యాడ్‌ చేసి ఇన్‌స్టాలో రీల్స్‌ బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్‌ తాజాగా సింగర్‌ భారతమ్మను కలిశారు. ఆమెతో జంపలకడి జారు మిఠాయి పాట పాడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement