
Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క షోతో రాత్రికి రాత్రే స్టార్స్‌గా మారిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బిఫోర్ బిగ్‌బాస్, ఆఫ్టర్ బిగ్‌బాస్ ఎఫెక్ట్ అనేంతలా కొందరి జీవితాలనే మార్చేసింది ఈ షో. ఇక బిగ్‌బాస్ అనంతరం కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్‌ను బట్టి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5 లేడీ అర్జున్ రెడ్డి పేరు సంపాదించిన లహరికి హౌస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా ఓ ఫోక్ సాంగ్ కోసం డీ గ్లామరస్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. దీంతో పాటు సినిమాల్లో సైతం లహరికి మంచి ఆఫర్లు వస్తున్నట్లు టాక్. కాగా సారీ నాకు పెళ్లైంది, అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌బాస్ షోతో కాస్త గుర్తింపు వచ్చిందనుకున్న సమయంలో దురదృష్టం కొద్దీ ఆమె మూడో వారమే ఎలిమినేట్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment