Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Lahari Shari: కాస్ట్‌లీ బీఎండబ్ల్యూ బైక్‌ కొన్న నటి.. రయ్యిరయ్యిమంటూ స్పీడు

Published Tue, Jan 25 2022 3:17 PM | Last Updated on Tue, Jan 25 2022 3:54 PM

Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral - Sakshi

Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ  లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది.

సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఓ లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మొత్తానికి ఈ బైక్‌ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్‌ సౌండ్‌ చాలా నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

దీంతో ఆనీ మాస్టర్‌ సహా పలువురు లహరికి కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స​ చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్‌కి చెందిన ఈ బైక్‌ సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement