
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన కంటెస్టెంట్ లహరి షారి. మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించిన ఈ అమ్మడు దురదృష్టం కొద్దీ మూడో వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయిన షో నుంచి బయటకు వచ్చిన అనంతరం అటు వరుస ఆఫర్లతో బిజీగా మారింది. బిగ్‌బాస్ షోతో ఎంతోమంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. తాజాగా తన ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ముచ్చటించిన ఈ భామ పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను వెల్లడించింది.
తన లైఫ్‌లో బిగ్‌బాస్ షోకు వెళ్లడమే అడ్వెంచర్ అని, మూడు వారాలకే బయటకు రావడం కాస్త బాధేసిందని తెలిపింది. హౌస్‌లో తనకు, రవికి ఉన్న బ్రదర్-సిస్టర్ రిలేషన్ గురించి చూపించలేదని చెప్పుకొచ్చింది. కాగా ఓ నెటిజన్ హగ్ ఇవ్వాల్సిందిగా కొంటెగా అడగ్గా ఒకే అంటూ హగ్ ఎమోజీని పంపి అతడికి షాకిచ్చింది.
ఇక రీఎంట్రీ గురించి ప్రశ్నించగా..షో నిర్వాహకులు ఇంత వరకు తనను సంప్రదించలేదని, ఒకవేళ అవకాశం వస్తే ఆలోచిస్తానని బదులిచ్చింది. షో నుంచి బయటకు వచ్చాక మూడు సినిమాలకు సైన్ చేశానని, త్వరలోనే అప్‌డేట్స్ ఇస్తానని పేర్కొంది.