యూట్యూబ్‌లో మనం రోజు మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్ ఇలా ప్రతి రోజు ఎదో ఒక కంటెంట్ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం చాలా తక్కువే అని చెప్పచ్చు. ఇటీవల ఫోక్ సాంగ్స్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న వేళ 'షేడ్స్ స్టూడియోస్' పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి 'వోక్స్ బీట్జ్' మ్యూజిక్ ఛానల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన దర్శకులు నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాష్టర్, హేమంత్ మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ హాజరయ్యారు.
(ఇది చదవండి: ప్రభాస్ 'సలార్' టీజర్ అఫీషియల్ ప్రకటన ఇదే)
ఈ మ్యూజిక్ ఛానెల్ ద్వారా సంగీత ప్రియులను, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించనున్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ పర్సన్ లవ్ కాన్సెప్ట్‌పై తీసిన 'నా మది', కాలేజీ వాతావరణంలో జరిగే లవ్ మెలోడీ సాంగ్ 'జారే మనసు జారే', 'వయ్యారి', 'షరీభో షరీభో', 'బులుగు చొక్కా', 'జాబిలివే' వంటి పాటలను రిలీజ్ చేశారు.
దర్శకులు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ.. 'ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా 'స్టోరీ టెల్లింగ్' సాంగ్స్‌లా సినిమా చూస్తున్నట్లే ఉన్నాయి. సినిమాలో పాటలు కంటే చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఛానెల్ ప్రేక్షకాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొత్త వాళ్లయినా ఇంత అద్భుతంగా చేసిన పాటలు సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. మీ ద్వారా చాలామంది కొత్త టాలెంట్ బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన నటీనటులు టెక్నికల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద బెస్ట్.' అని అన్నారు.
(ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్)
సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు బయట చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ ఛానల్ ద్వారా ఒక గుర్తింపు తీసుకొస్తున్న ఉపేంద్ర, దేవి ప్రసాద్‌కు నా ధన్యవాదాలు. వీరందరూ కలసి చేసిన పాటలు చాలా బాగున్నాయి. వీరు ఇలాగే ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment