Trinatha Rao
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రారంభం
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మంగళవారం ఆరంభమైంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించనున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు విజయ్ కనకమేడల కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ సినిమాలో సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. రావు రమేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నాం. దర్శకుడిగా నక్కిన త్రినాథరావు విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు డైలాగ్ రైటర్‌గా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మోసగాడి యాక్షన్
చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్’. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్’ ఫస్ట్ లుక్ బాగుంది.. సినిమా హిట్ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. -
మొదటి ప్రయాణం మరచిపోకూడదు: త్రినాథరావు నక్కిన
‘‘నాది, బెక్కెం వేణుగోపాల్‌గారి ప్రయాణం చిన్న సినిమా నుంచే ప్రారంభమైంది. అప్పట్లో మా సినిమా పొస్టర్, టీజర్, ట్రైలర్లను ఎవరు రిలీజ్ చేస్తారా? అని ఎదురు చూసే వాళ్లం. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నామని మా మొదటి ప్రయాణం మరచిపొకూడదు కదా?. అందుకే ఎవరైనా సపొర్ట్ కావాలని అడిగితే మా వంతు సపొర్ట్ చేయటానికి,ప్రొత్సహించటానికి వెనుకాడం’’ అని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్నారు. చంటి, లహరి జంటగా కేవీఆర్ దర్శకత్వంవహిస్తున్న చిత్రం ‘ఏపీ 31’. ‘నెంబర్ మిస్సింగ్’ అన్నది ట్యాగ్ లైన్. అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషక్స్ పై నారాయణ స్వామి.ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పొస్టర్‌ను త్రినాథరావు నక్కిన, ఫస్ట్ లుక్‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రిలీజ్ చేసి, ‘ఏపీ 31’ హిట్ కావాలన్నారు. ‘‘అందరి సపొర్ట్‌తో సినిమాను పూర్తి చేస్తున్నాం’’ అన్నారు కేవీఆర్. -
మీకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టమా.. అయితే మీ కోసమే ప్రత్యేక ఛానెల్!
యూట్యూబ్‌లో మనం రోజు మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్ ఇలా ప్రతి రోజు ఎదో ఒక కంటెంట్ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం చాలా తక్కువే అని చెప్పచ్చు. ఇటీవల ఫోక్ సాంగ్స్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న వేళ 'షేడ్స్ స్టూడియోస్' పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి 'వోక్స్ బీట్జ్' మ్యూజిక్ ఛానల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన దర్శకులు నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాష్టర్, హేమంత్ మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రభాస్ 'సలార్' టీజర్ అఫీషియల్ ప్రకటన ఇదే) ఈ మ్యూజిక్ ఛానెల్ ద్వారా సంగీత ప్రియులను, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించనున్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ పర్సన్ లవ్ కాన్సెప్ట్‌పై తీసిన 'నా మది', కాలేజీ వాతావరణంలో జరిగే లవ్ మెలోడీ సాంగ్ 'జారే మనసు జారే', 'వయ్యారి', 'షరీభో షరీభో', 'బులుగు చొక్కా', 'జాబిలివే' వంటి పాటలను రిలీజ్ చేశారు. దర్శకులు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ.. 'ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా 'స్టోరీ టెల్లింగ్' సాంగ్స్‌లా సినిమా చూస్తున్నట్లే ఉన్నాయి. సినిమాలో పాటలు కంటే చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఛానెల్ ప్రేక్షకాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొత్త వాళ్లయినా ఇంత అద్భుతంగా చేసిన పాటలు సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. మీ ద్వారా చాలామంది కొత్త టాలెంట్ బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన నటీనటులు టెక్నికల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద బెస్ట్.' అని అన్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు బయట చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ ఛానల్ ద్వారా ఒక గుర్తింపు తీసుకొస్తున్న ఉపేంద్ర, దేవి ప్రసాద్‌కు నా ధన్యవాదాలు. వీరందరూ కలసి చేసిన పాటలు చాలా బాగున్నాయి. వీరు ఇలాగే ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. -
యువకుడి ఔదార్యం
అప్పలఅగ్రహారం(సంతకవిటి), న్యూస్‌లైన్ : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు..కబ్జా చేసే రోజులివి. అలాంటిది సొంత స్థలాన్ని ఒక సామాజిక అవసరానికి విరాళంగా ఇవ్వడం నిజంగా ఉదాత్త నిర్ణయమే. అదీ పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఒక యువకుడు ఈ నిర్ణయం తీసుకోవడం.. దానికి సాక్షి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన జనసభ వేదిక కావడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొన్నాళ్లుగా గ్రామాల్లో జనసభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సంతకవిటి మండలం అప్పల అగ్రహారంలో బుధవారం జరిగిన జనసభలో పలువురు యువకులు, వివేకానంద యూత్ సంస్థ సభ్యులు గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న ఎంపీడీవో ఎల్.త్రినాథరావును కోరారు. ఆయన స్పందిస్తూ స్థలం సమస్యగా ఉందని, ఎవరైనా స్థలం చూపిస్తే గ్రంథాలయం ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చేస్తానన్నారు. దాంతో సభలోనే ఉన్న చిగులపల్లి ఉపేంద్రనాయుడు అనే యువకుడు కలగజేసుకొని ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన స్థలంలో గ్రంథాలయానికి ఎంత అవసరమైతే అంతా ఇస్తానని సభా ముఖంగా ప్రకటించాడు. ఆ విషయం లిఖితపూర్వకంగా తెలియజేయాలని, పంచాయతీ సర్పంచ్ ఆమోద పత్రం కూడా కావాలని అధికారులు సూచించడంతో.. అక్కడికక్కడే పెద్దలు, సభలో పాల్గొన్న ప్రజల సమక్షంలో స్థలం విరాళంగా ఇస్తానని రాసి ఇచ్చాడు. అక్కడే ఉన్న సర్పంచ్ దవళ సీతమ్మ కూడా వార్డు సభ్యులందరితో మాట్లాడి పంచాయతీ తరఫున త్వరలోనే ఆమోద పత్రం ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఉపేంద్రనాయుడు డిగ్రీ వరకు చదువుకున్నా.. తనకున్న ఐదారు ఎకరాల భూమినే సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనలాంటి చదువరుల కోసం గ్రంథాలయం ఏర్పాటుకు ఆయన ఉదారంగా ముందుకు రావడం ముదావహమని.. సాక్షి జనసభ వల్లే దీర్ఘకాల సమస్య పరిష్కారమైందని వివేకానంద యూత్ సభ్యులు సీహెచ్ సత్యనారాయణ, ఎ.రమేష్, డి.శ్రీనివాసరావు, జి.తవిటినాయుడు, ఇతర గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.