ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్రారంభం  | Hero Sundeep Kishan SK30 Movie Opening | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్రారంభం 

Published Wed, Apr 24 2024 4:40 AM | Last Updated on Wed, Apr 24 2024 4:40 AM

Hero Sundeep Kishan SK30 Movie Opening - Sakshi

∙‘దిల్‌’ రాజు, సందీప్‌ కిషన్‌

సందీప్‌ కిషన్‌ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మంగళవారం ఆరంభమైంది. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్‌ పతాకాలపై రాజేశ్‌ దండా ఈ సినిమాను నిర్మించనున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు విజయ్‌ కనకమేడల కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు.

‘‘ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉంటుంది. రావు రమేశ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నాం. దర్శకుడిగా నక్కిన త్రినాథరావు విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు డైలాగ్‌ రైటర్‌గా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement