ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Tollywood Suspence Thriller Project Z movie Trending In Ott | Sakshi
Sakshi News home page

Project Z: ఓటీటీలో ఊహించని రెస్పాన్స్.. ఒక్క రోజులోనే టాప్‌లో ట్రెండింగ్!

May 31 2024 7:43 PM | Updated on May 31 2024 8:01 PM

Tollywood Suspence Thriller Project Z movie Trending In Ott

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రాజెక్ట్- జెడ్‌ '. సీవీ కుమార్‌ డైరెక్షన్‌లో ఎస్‌బీకే ఫిల్మ్స్‌ ‍బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు.  సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మొదట తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీ 2017లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా తెలుగులో డబ్‌ చేసి ఆహాలో రిలీజ్‌ చేశారు.

ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి అధిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆహా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్‌ దక్కించుకుంటోంది. కాగా.. ప్రస్తుతం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, తమిళ వెర్షన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం  ఆహాలో స్ట‍్రీమింగ్ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement