
తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండగల్లో బతుకమ్మ ఒకటి. సహజ సౌందర్యానికి ప్రతీక బతుకమ్మ పండగ. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు.. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ పుట్టుకొస్తాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ ‘సాక్షి’వేదికగా రిలీజ్ అయింది. ‘తెల్ల తెల్లారిదింది తమ్ముళ్లు.. బతుకమ్మ పండగ నేడు తమ్ముళ్లు’అంటూ సాగే ఈ పాట.. బతుకమ్మ పండగ విశిష్టతను తెలియజేస్తుంది.