‘చిత్తూరు జిల్లా మొత్తం వినపడాల’ | Nani Krishnarjuna yudham lyrical Video | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 10:54 AM | Last Updated on Tue, Jan 16 2018 11:08 AM

Nani Krishnarjuna yudham lyrical Video - Sakshi

నాని సంక్రాంతి పండుగ మూడు రోజులు అభిమానుల కోసం మూడు కానుకలు ఇచ్చాడు. ఇప్పటికే తన తాజా చిత్రం కృష్ణర్జున యుద్ధం సినిమాకు సంబంధించిన రెండు లుక్స్ ను రిలీజ్ చేసిన నాని, మూడో రోజు ఓ మాస్ సాంగ్ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేశాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ పాటను పెంచల్ దాస్ స్వయంగా సాహిత్యం అందించి ఆలపించారు.

పాట సాహిత్యన్ని బట్టి చూస్తే చిత్తూరు జిల్లాలో కమలపూడి అనే గ్రామం నేపథ‍్యంలో సినిమా కథ నడుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు జానపద బాణీలో సాగే ఈ పాట హీరో కోసం హీరోయిన్‌ ఇళ్లు వదిలి వచ్చిన సందర్భంలో చిత్రీకరించినట్టుగా అర్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో నాని సరసన అనుపమా పరమేశ్వరన్, రుక్సర్‌ మిర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement