న్యూఢిల్లీ:1990లలో పాప్ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫాల్గుణి పాఠక్ ప్రేమ, దాండియా గేయాలతో యువతరాన్ని మంత్రముగ్ధులను చేసిందని చెప్పుకోవచ్చు. మనదేశంలో జానపద గీతాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఈమె చెబుతోంది. ముంబైలోని నవరాత్రి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న ఈ 42 ఏళ్ల గాయని ‘ఇంద్ర మెరువ గయి’, ‘చమ్ చమ్ పాయలియా’ వంటి గేయాలతో వీనుల విందు చేసింది. ‘పాప్ గేయాలకంటే జానపద గీతాలకు ఆదరణ ఎక్కువ ఉంటుందన్నది నిజం. అందుకే మేం జానపద గీతాలను ఎంచుకుంటాం. అవి సహజమైనవి కాబట్టి ఆనందాన్ని పంచుతాయి. నాకు కూడా జానపద గీతాలు చాలా ఇష్టం’ అని పాఠక్ వివరించింది.
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల్లో ఇటీవలే ముగియడం తెలిసిందే. ఆ సమయంలో పాఠక్ తీరిక లేకుండా గడిపింది. ముంబై ఘాట్కోపర్‌లోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఈమె పాడిన దాండియా గేయాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.