బంగార్రాజు సినిమాలో నాగ చైతన్యను చూసి అంతా సర్ ప్రైజ్ అవుతారు. ఇందులో ఉన్నది నాగ చైతన్యనేనా? అని ఆశ్చర్యపోతారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి కూడా చై అనుమానంగానే ఉన్నాడు. నన్ను నమ్ము అని చెప్పాను. ఇప్పుడు అదొక బాధ్యతగా మారింది. చైతూ రూరల్ బ్యాక్ డ్రాప్లో చేసిన మొదటి సినిమా ఇదే’అన్నారు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. ఆయన, నాగచైతన్య రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. ‘సోగ్గాడే చిన్ని నాయన’లొ యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. కానీ ఈ మూవీలో నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ ఎంట్రీ కూడా వచ్చినట్టు అయింది.
► ‘సోగ్గాడే..’ చాలా బాగా ఆడింది. అందరూ సినిమాను అంగీకరించారు. అది మకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లు బంగార్రాజును చూడాలని అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే బాగుండాలి. అన్నింటి కంటే ఎక్కువగా నాగ చైతన్య రావడంతో మరింత బాధ్యత పెరిగింది. సంక్రాంతికి పండుగలాంటి సినిమా ఇస్తున్నామని ప్రేక్షకులకు మాటిచ్చాం. అది ఇంకా పెద్ద బాధ్యత.
►మన తెలుగు సినిమాల్లో బ్లడ్ రిలేషన్ సినిమాలు ఎక్కువగా వర్కవుట్ అవుతుంటాయి. నేను, నాన్నగారితో చేసిన సినిమాలు వర్కవుట్ అయ్యాయి. అది కమర్షియల్ ఫార్మూలా. ఆ ఫార్మాట్లోనే సినిమా చేద్దామని కళ్యాణ్ కృష్ణ అన్నాడు. కథ తీసుకురా చేద్దామని అన్నాను. అక్కడే లేట్ అయింది. ఆ తరువాత కరోనా వచ్చింది.
► పంచెకట్టు ధరించినప్పుడల్లా నాన్న గారు గుర్తుకు వచ్చేవారు. ‘మనం’ సినిమాను వేరే ఆర్టిస్ట్‌లను పెట్టి తీస్తే వర్కవుట్ అయ్యేది కాదు. నాన్న గారు లేకపోయినా, నేను లేకపోయినా, చై లేకపోయినా వర్కవుట్ అవ్వకపోయేది. హిందీలో చాలా మంది ఈ సినిమాను తీద్దామని అనుకున్నారు. కానీ మా కాంబినేషన్ వల్లే సినిమా వర్కవుట్ అయిందని తెలుసుకున్నారు. విక్రమ్ కూడా ట్రై చేశాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. బంగార్రాజు కూడా అంతే.
► ఇష్క్ సినిమాలో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ నచ్చి మనం సినిమాకు ఓకే చేశాం. మాకు అనూప్ ఎంతో స్పెషల్. టైం ఇస్తాడు. టైం తీసుకుంటాడు. అన్నపూర్ణలో ఫ్యామిలీలా ఉంటాడు. ఇది బాగా లేదంటే ఫీల్ అవ్వడు. కళ్యాణ్‌కి అతనికి బాగా సెట్ అయింది. నేను చెప్పకముందే అనూప్ పేరుని కళ్యాణ్ చెప్పాడు. సోగ్గాడే కంటే మంచి మ్యూజిక్‌ను ఇచ్చాడు. మనం సినిమా మ్యూజిక్ నచ్చి అప్పుడు కూడా మ్యూజికల్ నైట్ చేశాం.
► నా బాడీ లాంగ్వేజ్ కోసం సోగ్గాడే చిన్నినాయనా సినిమాను చూడమని చైకి సలహా ఇచ్చాను. సీనియర్ బంగార్రాజు ఆత్మ లోపలకి ఎంట్రీ అయ్యాక బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ మారుతుంది. దాని కోసం చై డైలాగ్స్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. వాటిని చూసుకుంటూ చై ఫాలో అయ్యాడు. అయితే నాకంటే ఆ యాస మీద కళ్యాణ్‌కు ఎక్కువ పట్టుంది. అంతా ఆయనే చూసుకున్నాడు.
► ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు వంటి సినిమాలతో ఊరి వాతావరణంలో సినిమాలు బాగా నచ్చాయి. మొత్తం ఓపెన్ అయి నటించొచ్చు. ఆ పాత్రల్లో ఓ పొగరబోతుదనం ఉంటుంది. ఆ భాష నాకు చాలా ఇష్టం.
► రమ్యకృష్ణది నాది గోల్డెన్ కాంబినేషన్. మాకు ఒకరి గురించి ఇంకొకరికి తెలుసు. మా కెమీస్ట్రీ బాగుంటుంది. రమ్యతో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. సెట్లో అంతా నవ్వుతూనే ఉంటాం.
► కృతి శెట్టి చక్కగా తెలుగు నేర్చుకుంది. తెలుగులో మాట్లాడుతుంది. ఆమెలో నాకు నచ్చింది అదే విషయం. సెట్లో తెలుగులోనే మాట్లాడుతుంది. హిందీ, ఇంగ్లీష్, తులు అన్ని భాషలు వచ్చినా కూడా తెలుగులోనే మాట్లాడుంది. ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. సెట్‌కి టైంకి వస్తుంది. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలా ఉండదు. బయట ఆమె క్లాస్‌గా ఉంటుంది. కృతి శెట్టి ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది.
► ఆగస్ట్ 25న ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాం. ఆ రోజు యూనిట్ అందరికీ చెప్పాను. సంక్రాంతికి మనం సినిమాను విడుదల చేయాలి. లేదంటే వచ్చే సంక్రాంతికి రావాల్సి ఉంటుంది. కావాలంటే సినిమాను ఇప్పుడు ఆపేద్దామని అన్నాను. మేం అంతా ఉన్నాం చేద్దామని యూనిట్ అంతా కూడా కష్టపడింది.ఈ సంక్రాంతికి పట్టుపట్టి వచ్చాం. ఈ చిత్రం బాగా ఆడుతుందని, మంచి నంబర్స్ వస్తాయని నమ్మకంగా ఉంది.
► కళ్యాణ్ కృష్ణ రైటింగ్ అద్బుతంగా ఉంటుంది. ఆయన రాసిన పాట కూడా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఆయనతో పని చేయడం నాకు ఇష్టం. ఏదైనా బాగా లేదంటే మళ్లీ రాసుకొస్తాడు. సోగ్గాడే తరువాత ఈ కారెక్టర్ల మీద మంచి పట్టు వచ్చింది. బంగార్రాజు సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. అతనితో పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది.
► ప్రొడక్షన్ పరంగా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ను నేను తీసుకుంటాను. యాక్టింగ్ పరంగా నాగ చైతన్యకు వస్తుంది. నాగ చైతన్య ట్రాన్స్ఫర్మేషన్ అందరూ చూస్తారు. అద్భుతంగా నటించాడు. లవ్ స్టోరీలో మొన్నే చూశారు కదా? మాస్ కమర్షియల్ సినిమాను నాగ చైతన్య ఇంత బాగా చేయగలడా? అని అందరూ అనుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment