Naga Chaitanya Shares Krithi Shetty Look From Bangarraju- Sakshi
Sakshi News home page

Naga Chaitanya-Nagarjuna Akkineni: కృతిశెట్టి లుక్‌ షేర్‌ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్

Published Thu, Nov 18 2021 2:54 PM | Last Updated on Thu, Nov 18 2021 4:21 PM

Naga Chaitanya Shares Krithi Shetty Look From Bangarraju And Nagarjuna Asks Funny Question - Sakshi

Naga Chaitanya Funny Reply To Father Nagarjuna Over Krithi Shetty First Look: హీరో నాగార్జున అక్కినేని, నాగ‌చైత‌న్యలు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. క‌ల్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన హిట్‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్‌కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనుంది. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ఈ క్రేజీ మ‌ల్టీ స్టారర్ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది.

చదవండి: Preity Zinta: 46 ఏళ్లకు తల్లైన స్టార్‌ హీరోయిన్‌, కవలలకు జననం

సంక్రాంతికి బంగార్రాజు విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలను వేగ‌వంతం చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో బంగార్రాజులో  కృతి శెట్టి లుక్‌ను ఈ రోజు విడుదల చేస్తూ ఆమె పాత్రను మేకర్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక కృతి లుక్‌ను చై తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. దీంతో చై ట్వీట్‌పై నాగార్జున స్పందిస్తూ..  ‘ఒకే బాగుంది రా.. మరి బంగార్రాజు విషయమేంటి’ అంటూ ప్రశ్నించాడు.

చదవండి: Krithi Shetty: ‘బంగార్రాజు’లో కృతి పాత్ర, ఫస్ట్‌లుక్‌ విడుదల

దీనికి నాగ చైతన్య ఆసక్తికర రీతిలో సమాధానం​ ఇచ్చాడు. ‘బంగార్రాజు త్వరలోనే వస్తున్నాడు నాన్న. లేడీస్‌ ఫస్ట్‌. అందుకే మా నాగలక్ష్మి ఫస్ట్‌లుక్ షేర్‌ చేస్తున్నాం’ తండ్రిని ట్యాగ్‌ చేస్తూ రీట్వీట్‌ చేశాడు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. తొలిసారిగా సోషల్‌ మీడియాలో తండ్రికొడుకులు సరదాగా మాట్లాడుకోవడం చూసి అక్కినేని అభిమానులంతా మురిసిపోతున్నారు. అలాగే చై కూడా సామాజిక మాధ్యమాల్లో చాలా అరుదుగా పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటాడనే విషయం తెలిసిందే. కృతి లుక్‌ చై షేర్‌ చేయడంతో ఇది కూడా ఆసక్తిగా వార్తల్లో నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement