
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత మంచి ఫామ్‌లోకి వచ్చాడు నాగ చైతన్య. ఆ స్పీడులోనే చకచకా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ‘శైలజా రెడ్డి అల్లుడు’, చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరవాత శివ నిర్వాణ డైరెక్షన్‌లో మరో సినిమాను ఓకే చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు. తాజాగా శైలజా రెడ్డి అల్లుడు టీజర్‌ను విడుదల చేశారు.
ఈ కాన్సెప్ట్‌తో ఇది వరకే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి కథకు మారుతి తనదైన టేకింగ్‌ను జోడించి తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’ అనే డైలాగ్‌తో సినిమా థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. గోపి సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. లుక్స్ పరంగా నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ ఆకట్టుకున్నారు. కీలకపాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ పాత్రను ఎక్కువగా రివీల్ చేయకుండా టీజర్‌ను కట్ చేశారు. ఈ మూవీని ఆగస్టు 31న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment