మస్త్‌ బిజీ | Naga Chaitanya Sailaja Reddy Alludu and Savya Sachi | Sakshi
Sakshi News home page

మస్త్‌ బిజీ

Published Sun, Jun 17 2018 12:18 AM | Last Updated on Sun, Jun 17 2018 12:18 AM

Naga Chaitanya Sailaja Reddy Alludu and Savya Sachi - Sakshi

నాగచైతన్య

నాగచైతన్య మల్టీటాస్కింగ్‌ చేస్తున్నారు. ఓ వైపు ‘సవ్యసాచి’ మరోవైపు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలను కంప్లీట్‌ చేస్తూ, మస్త్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’  సినిమా డబ్బింగ్‌ కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నవీన్‌ ఎర్నేని, రవి శంకర్, మోహన్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ భామ నిధి అగర్వాల్‌ కథానాయిక. 10 రోజుల పాటు కొన్ని సీన్స్, అలాగే ఐటమ్‌ సాంగ్‌ మినహా సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అయిందని సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను కూడా స్పీడ్‌గా కంప్లీట్‌ చేస్తోందట చిత్రబృందం. ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని  ‘నిన్ను రోడ్డు మీద చూసినది.....’ సాంగ్‌ని రీమిక్స్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా, నాగచైతన్యలపై ఈ సాంగ్‌ను  జూన్‌ లాస్ట్‌ వీక్‌లో  షూట్‌ చేయనున్నారట. సో.. సినిమాకు సంబంధించిన ఆఖరి ఘట్టంలోకి అడుగుపెట్టేసారన్నమాట ఈ సవ్యసాచి. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరకర్త.  ఈ సినిమాను జూలై లాస్ట్‌ వీక్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రేమమ్‌’ లాంటి హిట్‌ తర్వాత దర్శకుడు చందుతో నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement