Multi tasking
-
అరెరె.. మర్చిపోయా!
‘‘అతనూ.. మన ఆఫీస్‌లో పనిచేస్తాడే.. పేరేంటో మర్చిపోయానబ్బా’’ ‘‘నిన్ననే నెట్‌ఫ్లిక్స్‌లో చూశా సినిమా చాలా బాగుంది.. పేరేంటంటే, నోట్లో నానుతూనే ఉంది.. గుర్తు రావడం లేదు’’ ‘‘మమ్మీ.. బైక్ కీస్ కనపడటం లేదు, కాస్త చూడు ఎక్కడ పెట్టానో గుర్తురావడం లేదు’’ ఇలాంటి మాటలు మీరు తరచుగా అంటుంటే.. లేదా ఎవరి నుంచైనా వింటుంటే.. సిల్లీగా తీసుకోకండి. ఎందుకంటే ఇది కూడా ఒక వ్యాధి. దాని పేరు సూడో డిమెన్షియా! బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను మర్చిపోవడం, మన బండి తాళాలను తరచుగా వెతుక్కోవడం, ఒకటి రెండ్రోజుల క్రితం చూసిన సినిమా పేరు కూడా గుర్తు లేకపోవడం.. ఈ లక్షణాలను వైద్యులు ‘సూడో–డిమెన్షియా’గా పేర్కొంటున్నారు. డిమెన్షియా అనేది ఓ వయసు దాటాక వృద్ధాప్యంలో చుట్టుముట్టే వ్యాధి కాగా.. ప్రస్తుతం యువతపై కూడా ఇది ప్రభావం చూపుతోంది. దీని బారిన పడిన రోగులకు తరచుగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం నిరాశ లేదా అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు ఉంటాయి. కేసులు పెరుగుతున్నాయి... ప్రధానంగా అధిక ఒత్తిడి, మల్టీ టాస్కింగ్, తద్వారా చోటు చేసుకుంటున్న నిస్పృహ, నిరాశ.. వంటివి ఈ పరిస్థితికి కారణం. ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, ‘‘యువతలో గణనీయంగా మతిమరుపు కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యల నుంచి పరిష్కారం కోరుతూ నెలలో కనీసం 5–10 మంది వరకూ 50 ఏళ్ల లోపు వారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు’’అని చెప్పారు. ‘‘ప్రస్తుతం యువతలో కెరీర్–సంబంధిత ఒత్తిడి బాగా ఉంటోంది. తద్వారా అధిక పనిభారం సర్వసాధారణమైంది. సోషల్ స్టేటస్ గురించి ఆందోళన కూడా దీనికి తోడవుతోంది. ఇలాంటివన్నీ మెదడుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి, అది సమాచారాన్ని పూర్తిగా ప్రాసెస్ చేయడమనే దాని విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది, ఎక్కువ సమయం పాటు ప్రాసెసింగ్ చేసే ‘మల్టీ టాస్కింగ్’కూడా జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుంది’’అని డాక్టర్ గుప్తా చెప్పారు. మెమొరీ.. మెదడే దారి.. ‘‘ఓ విషయంపై శ్రద్ధ పెట్టడం, దాన్ని స్వీకరించడం అనంతరం దాన్ని నిలుపుకోవడం.. ఇలా జ్ఞాపకశక్తి మూడు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. దీనిలో ప్రతి దశకు మెదడు నుంచి సహకారం అవసరం, కానీ అధిక స్థాయి పని ఒత్తిడి దాని పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సూడో డిమెన్షియా వెనుక కారణాల గురించి తెలుసుకున్న తర్వాత కొద్దిపాటి ప్రయత్నం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఏకాగ్రత సాధించేందుకు ప్రయత్నించడం, డిప్రెషన్‌కు చికిత్స తీసుకోవడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది’’అని గుప్తా వివరించారు. – సాక్షి, సిటీబ్యూరో ‘‘ఈ తరహా లక్షణాలతో నెలకు 10–12 మంది రోగులు వస్తున్నారు. పని ఒత్తిడి, అతిగా ప్రతికూల ఆలోచనలు, ఒకే సమయంలో అనేక పనులు చేయాలనే మల్టీ టాస్కింగ్.. ఇతరులతో సమస్యల కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. మనసులో తెలియని ఆరాటం, ఆత్రుత ఉన్నప్పుడు, అనేక రకాల పనులు చేయలేం. కౌన్సెలింగ్ సెషన్లు, కాగి్నటివ్ బిహేవియరల్ థెరపీ రిలాక్సేషన్లు ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు కోలుకోవడానికి సహాయపడతాయి’’. – డాక్టర్ ఆర్తీ ఆనంద్, ప్రముఖ సైకాలజిస్ట్ -
Himaja Apparascheruvu: మల్టిపుల్ వర్క్స్‌తో సక్సెస్.. ఇంగ్లీషు ఎంత ముఖ్యమో..
కెరీర్లో విజయం సాధించిన మహిళలు కుటుంబంపై దృష్టి పెట్టలేరని చాలామంది అనుకుంటారు. అలాగే, మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నా, తమ కోసం తాము టైమ్‌ను కేటాయించుకోరు అనీ అంటుంటారు. అయితే ఈ ఊహలన్నీ తప్పని హిమజ అప్పరాశ్చెరువు రుజువు చేస్తోంది. మన శక్తి ఏంటో మనకే తెలుసు అని తన పనుల ద్వారా చూపుతోంది. అనంతపురం వాసి అయిన హిమజ అప్పరాశ్చెరువు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా, మారథా రన్నర్‌గా సత్తా చాటుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలతోనూ మల్టిపుల్ వర్క్స్‌తో రాణిస్తోంది. చిన్న పట్టణంలో పెరిగిన హిమజ పెద్ద కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటోంది. తన కెరీర్‌తో పాటు ఇద్దరు పిల్లల బాధ్యతనూ నిర్వహిస్తోంది. దీనితోపాటు, తన స్వంత అభిరుచినీ నెరవేర్చుకుంటోంది. సున్నా నుంచి మొదలు ‘నా జీవన ప్రయాణం సున్నాతో మొదలుపెట్టి ఈ రోజు చేరుకున్న చోటికి రావడం అంత తేలిక కాలేదు. ఐఐటీ రూర్కీలో ఇంజనీరింగ్ చేశాను. కాలేజీలో చేరేసరికి నాకు ఇంగ్లీషు సరిగా రాదు, హిందీలోనూ సరిగా మాట్లాడలేను. కానీ సంకల్పంతో, నేను ప్రతి సవాల్‌ను అధిగమిస్తూ, జీవితంలో చాలా నేర్చుకుంటూ విజయం వైపు పయనిస్తూనే ఉన్నాను. రానిదంటూ లేదని.. ఇంజినీరింగ్ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేశాను. ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిఎఎమ్ పట్టా అందుకున్నాను. 2017లో అమెజాన్ కంపెనీలో సప్లై చైన్ ఎగ్జిక్యూషన్ టీమ్ పోస్ట్‌పై సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నేటి కాలంలో విద్యార్థులైనా, పనిచేసే వృత్తి నిపుణులైనా వారికి ఇంగ్లీషు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నాకు కూడా అర్థమైంది. ఈ అవసరాన్ని స్వయంగా గ్రహించి, నేను అమెజాన్ అలెక్సాలో ఇంటరాక్టివ్ సెషన్స్ చేర్చాను. ఈ నైపుణ్యంతో ఏ వయసు వారైనా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవచ్చు. కుటుంబంపై పూర్తి శ్రద్ధ నా కెరీర్‌తో పాటు కుటుంబంపై పూర్తి శ్రద్ధ పెట్టాను. నా కెరీర్లో ముందుకు వెళుతున్న సమయంలోనే రెండుసార్లు తల్లిని అయ్యాను. ఈ సమయంలో కొత్తగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ నా భర్త ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. కెరీర్ మాత్రమే ముఖ్యం కాదు, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమూ ముఖ్యమే. అందుకే, హోమ్‌వర్క్ చేయించడం, వారితో ఆడుకోవడం, వారిని పరీక్షలకు సిద్ధం చేయడం, వారితో సరదాగా గడపడం వంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాను. సమతుల్యత అవసరం.. నా దినచర్యలో అడుగడుగునా నా భర్త సపోర్ట్ ఉంది. తన తల్లిదండ్రుల పూర్తి బాధ్యతనూ తీసుకుంటాడు. మేము మా పిల్లలను వ్యక్తిగతంగా చూసుకోవడం, వారితో సమయం గడపడం మంచిదని నమ్ముతాము. బయటి పని, ఇంటి పని ఈ రెండింటి మధ్య సమానమైన సమతుల్యతను పాటిస్తాను. నా పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం, కొత్త పనులు చేయడం నాకు ఇష్టం. మల్టిపుల్ టాస్కింగ్ మనల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాను. ఆన్లైన్–ఆఫ్‌లైన్ క్లాసులతోనూ సేవలు అందిస్తుంటాను. మారథాన్ రన్నర్‌గానూ, నా ఇతర అభిరుచుల వైపుగా సాగుతుంటాను’ అని వివరిస్తారు ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్. (క్లిక్ చేయండి: రేణు ది గ్రేట్.. స్త్రీ హక్కుల గొంతుక) -
మస్త్ బిజీ
నాగచైతన్య మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. ఓ వైపు ‘సవ్యసాచి’ మరోవైపు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలను కంప్లీట్ చేస్తూ, మస్త్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయిక. 10 రోజుల పాటు కొన్ని సీన్స్, అలాగే ఐటమ్ సాంగ్ మినహా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా స్పీడ్‌గా కంప్లీట్ చేస్తోందట చిత్రబృందం. ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది.....’ సాంగ్‌ని రీమిక్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా, నాగచైతన్యలపై ఈ సాంగ్‌ను జూన్ లాస్ట్ వీక్‌లో షూట్ చేయనున్నారట. సో.. సినిమాకు సంబంధించిన ఆఖరి ఘట్టంలోకి అడుగుపెట్టేసారన్నమాట ఈ సవ్యసాచి. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను జూలై లాస్ట్ వీక్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రేమమ్’ లాంటి హిట్ తర్వాత దర్శకుడు చందుతో నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. -
మగువలు... మహరాణులు
మగువలు మల్టీ టాస్కింగ్ రాణులు అంటున్నారు బ్యూటీ క్వీన్ రుచికాశర్మ. వంట చేయడంలోనే కాదు.. కుటుంబాన్ని నడపడంలోనూ మహిళలు ది బెస్ట్ అని చెబుతున్నారు. స్త్రీలు ఎంపవర్ అయితేనే దేశం సూపర్ పవర్ అవుతుందంటున్నారు. మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ 2014కు ఎన్నికైన తర్వాత తన కు, తన మాటకూ వెయిట్ పెరిగిందంటున్న ఈ బ్యూటీ క్వీన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. విశేషాలు ఆమె మాటల్లోనే.. 18 ఏళ్లుగా నేను వంట చేస్తున్నాను. బ్యూటీ క్వీన్ కిరీటం దక్కటం చాలా ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఇది నా లైఫ్‌కి సెకండ్ ఇన్నింగ్స్. ఇప్పుడు చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు. బ్యూటీ క్వీన్ అంటే కేవలం కిరీట ధారణ మాత్రమే కాదు. దాన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ అందాల పోటీలో నా ప్లాట్‌ఫాం విమెన్ ఎంపవర్మెంట్. దాని కోసమే నా జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను. పది పనులు చేయగలం.. మహిళలు పుట్టుకతోనే మల్టీ టాలెంటెడ్. ఏకకాలంలో పది పనులు చేయగలం. టైం మేనేజ్మెంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. మా బాబు ఇంటికి రాగానే వాడికి హోం వర్క్ చేయిస్తూ, వంట పని చేసుకుంటాను. ఫోన్లు వస్తే ఆన్సర్ చేస్తాను. మళ్లీ మా వాడి డౌట్లు కూడా తీరుస్తుంటాను. అలా మహిళలకు ఉన్న అపురూపమైన వరం మల్టీ టాస్కింగ్. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఏ రంగంలో అయినా సక్సెస్ కావొచ్చు. సీన్ మారింది.. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవారు. కాలక్రమంలో కుటుంబ బాధ్యతతో భర్తతో పాటు ఆర్థిక భారాన్ని పంచుకున్నారు. కొంతకాలం వరకు సెకండ్ ఎర్నర్గా ఉన్న స్త్రీలు ఇప్పుడు ఓన్లీ ఎర్నర్ అవుతున్నారు. ఏ పనైనా క్రియేటివ్‌గా చేయడంలో మహిళలు ముందుంటారు. అలాంటి స్త్రీలకు ఏదైనా కళలో కొంత శిక్షణ ఇవ్వగలిగితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. దక్షిణాసియా, ఇండియాలో అందరు స్త్రీలు 9-6 ఉద్యోగాలకు వెళ్లలేరు. వాళ్లు ఇంటి నుంచే ఏదైనా తయారు చేసి, వ్యాపారం చేసుకోగలిగితే ఆ కుటుంబ పరిస్థితే మారిపోతుంది. అదే లక్ష్యం జీఎంఆర్ ఫౌండేషన్ వాళ్లు మూడు గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. అందులో నేను కూడా పాలుపంచుకుంటున్నాను. వచ్చే మూడేళ్లలో వీలైనంత మంది మహిళలను ఆర్థిక శక్తిగా తయారు చేయడం నా లక్ష్యం. ఎక్కువ పెట్టుబడి అవసరం లేని చాక్లెట్ మేకింగ్, క్యాండిల్ తయారీ నేర్పుతున్నాను. ఇక్కడ తయారైన చాక్లెట్స్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విక్రయిస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్‌ని నామినేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ కోసం ఎంకరేజ్ చేస్తున్నాం. 5 వేల పుస్తకాలు రూరల్ ప్రభుత్వ పాఠశాలల్లో పంచాలని నిర్ణయించుకున్నాం. శ్రీశైలం దగ్గర కునుకూరులోని జిల్లా పరిషత్ స్కూల్లో 500 పుస్తకాలు డొనేట్ చేశాను. ఆధ్యాత్మికతతో ఆత్మవిశ్వాసం ట్రెడిషనల్ కుటుంబంలో నుంచి వచ్చాను. నా జీవితంలో స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయి. మంచి చెడు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి స్పిరిట్యువాలిటీ హెల్ప్ అవుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉంటే సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం వస్తుంది. - ..:: ఓ మధు ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్