
కొత్త అల్లుడు ఇంటికొస్తే అత్తారింటివాళ్లు నానా హైరానా పడిపోతారు. పిండి వంటలతో అల్లుడు తబ్బిబ్బయ్యేలా చేస్తారు. శైలజా రెడ్డిగారు కూడా తన అల్లుణ్ని అలానే చూసుకుంటున్నారట. మరి ఈ కొత్త అల్లుడు అత్తగారింట్లో ఎన్ని రోజులుంటాడట? అంటే.. ఇంకో ఇరవై రోజులు పైనే. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. నాగ చైతన్య అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ వచ్చే నెల 22వరకు జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్య, రమ్యకృష్ణల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో చేస్తోన్న ‘సవ్యసాచి’ సినిమాలో ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ సాంగ్ షూటింగ్‌లో తమన్నాతో కలసి పాల్గొంటారు నాగచైతన్య.
Comments
Please login to add a commentAdd a comment