
‘శైలజారెడ్డి అల్లుడు’ వచ్చే టైమ్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 13న అల్లుడు థియేటర్లలోకి రానున్నాడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఎస్. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కావాల్సింది.
అయితే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కేరళలో జరుగుతుండటం.. అక్కడ వరదల వల్ల ఆటంకం ఏర్పడటంతో విడుదలను వాయిదా వేశారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో చైతూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.