గోవా తీరంలో ప్రేయసితో కలిసి ప్రియరాగాలు పాడారు నాగచైతన్య. మరి.. ఎలాంటి బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ఈ సాంగ్‌ను చిత్రీకరించారనేది ఇప్పుడు సస్పెన్స్. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించారు. నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేశారని టాక్.
ఈ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక్క సాంగ్‌ను గోవాలో పూర్తి చేశారు చిత్రబృందం. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, అనూ బేబి సాంగ్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. రెండో సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నారు. గిరిబాబు, నరేశ్, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.
ప్రియ రాగాలు
Published Wed, Aug 15 2018 1:57 AM | Last Updated on Wed, Aug 15 2018 1:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment