
సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్‌ఎస్ నాయుడు దర్శకత్వంలో ‘నన్ను దోచుకుందువటే’తో సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా వినాచక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
అయితే అదే రోజు నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుధీర్ బాబు తమ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment