
వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నాగచైతన్య, మరో ఆసక్తికర చిత్రంతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాను ఎనౌన్స్ చేసిన చైతూ, మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమాతో మరోసారి ఆకట్టుకున్న మారుతి, చైతన్యతో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో అన్న ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ కాంబినేషన్‌కు సంబందించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తాజాగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ టైటిల్ చైతూ, మారుతిల కాంబినేసన్‌లో తెరకెక్కబోయే సినిమా కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. టైటిల్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment