సెట్స్ మీదకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ | Naga Chaitanya and Maruthi is ready to go on floors | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 10:13 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

Naga Chaitanya and Maruthi is ready to go on floors - Sakshi

యంగ్ హీరో నాగచైతన్య, కామెడీ ఎంటర్‌టైనర్ల స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మారుతి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫుల్‌ స్క్రిప్ట్‌తో రెడీ అ‍య్యాడు. ఈ నెల 19 నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించనున్నామని తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం చందూ మొండేటి దర‍్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మారుతి సినిమాను లైన్‌ లో పెట్టాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. శైలజా రెడ్డిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement