కెరీర్‌లో పెద్దగా హిట్స్ లేకపోయినా గ్లామర్ లుక్స్ తో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ అను ఇమ్మాన్యూల్. మలయాళ ఇండస్ట్రీలో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో పర్వాలేదనిపించినా తరువాత అను నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు.
తమిళ్‌లో చేసిన ఒక్క సినిమా తుప్పారివాలన్ మాత్రం ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ భామ కోలీవుడ్ క్రేజీ హీరో సరసన నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి సరసన నటించేందుకు అను ఇమ్మాన్యూల్ ఓకె చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment