
బిగ్ బాస్ ఆఫీస్ – స్పూఫ్ వీడియో
నిడివి : 16 ని. 45 సె.
హిట్స్ : 7,53,429
తెలుగులో ‘బిగ్ బాస్’ షో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో మీద సోషల్ మీడియాలో వస్తున్న ట్రాల్స్, పోస్ట్స్ చూస్తే అర్థం అవుతుంది. నలుగురు స్నేహితుల మధ్య టాపిక్ ఆఫ్ డిస్కస్ బిగ్ బాస్. అందులో నుంచి నెక్ట్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అని. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ తీసుకుని ‘బిగ్ బాస్ ఆఫీస్’ అంటూ ఓ స్పూఫ్ వీడియో చేశారు వైరలీ తెలుగు ఛానల్ వాళ్లు. ఇందులో ‘మహాతల్లి, పక్కింటి కుర్రాడు, జల్సా రాయుడు, బమ్‌చిక్ బబ్లూ’ వంటి యూట్యూబర్స్‌ను కంటెస్టెంట్స్‌గా చూడొచ్చు. బిగ్ బాస్‌లో లాగానే దీన్ని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెట్ చేశారు. ఇప్పటి వరకు బిగ్‌బాస్‌లో జరిగిన హైలైట్స్‌ను, ఒక్కో క్యారెక్టర్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ సాగుతుంది ఈ వీడియో. బిగ్‌బాస్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ఈ సిచ్యువేషన్స్, కామెడీని అర్థం చేసుకోగలరు. ఎలిమినేషన్ రౌండ్‌ని లీవ్ ఇవ్వడంతో కనెక్ట్ చేసి ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లు ఈ వీడియోను బాగా ఎంజాయ్ చేయొచ్చు.
సీమరాజా – టీజర్
నిడివి :00:59 సె.
హిట్స్ : 28,46,880
టీజర్‌లు రెండు రకాలుగా కట్ చేస్తుంటారు దర్శక–నిర్మాతలు. ఒకటి సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో చూచాయిగా చెప్పే ప్రయత్నం. రెండోది.. హీరోను హైలైట్ చేస్తూ అతనికి ఎలివేషన్ ఇచ్చే డైలాగ్స్‌ను రెండు పొందుపరచడం. ‘సీమరాజా’ ట్రైలర్ రెండో క్యాటగిరీ.. అంటే కమర్షియల్ ఫార్మాట్‌లోకి వస్తుంది. నటుడు శివకార్తికేయ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌లా ‘సీమరాజా’ టీజర్ కనిపిస్తుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేసిన ఈ మాస్ స్టోరీని పొన్రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఇది హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్ అయినప్పటికీ సినిమాలో విలన్‌గా హీరోయిన్ సిమ్రాన్ కనిపించనున్నారు. ‘నాటు కోడి తిని నీ శరీరాన్ని సిద్ధం చేసుకో.. మేం ఇచ్చే దెబ్బలకు నిలబడాలి కదా?’ అంటూ శివకార్తికేయన్‌కు వార్నింగ్ ఇస్తూ టీజర్‌లో కనిపిస్తారు సిమ్రాన్. ఈ టీజర్ తమిళ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. రిలీజ్ చేసిన మూడు రోజులకే రెండు మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది.
శైలజారెడ్డి అల్లుడు – టీజర్
నిడివి : 47 సెకన్లు
హిట్స్ :27,60,890
అందమైన అమ్మాయిని ఓ కుర్రాడు ప్రేమలో పడేశాడు. కానీ ఆ అమ్మాయికి ఈగో అనే ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉంది. అది ఏ రేంజ్‌లో ఉందంటే... ఆ అమ్మాయి చెప్పిన విషయానికి పక్కవాళ్లు ఎలాంటి సమా«ధానం ఇవ్వాలో కూడా ముందే చెబుతుంది. మరి ఈ కుర్రాడు ఆ అమ్మాయి మనసైతే గెలుచుకున్నాడు కానీ ఆమె ఈగోను ఎలా శాటిస్‌ఫై చేశాడన్నది వెండితెరపై చూడాల్సిందే. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment