
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇదే నంటూ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ పోస్టర్ పై దర్శకుడు మారుతి స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటో ఓరిజినల్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. మరో వారం రోజుల్లో అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ తెలిపారు. నాగచైతన్య సరసన అనూ ఇమ‍్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
To all the fans of @chay_akkineni we would like to clarify that the image that is being circulated as #SailajaReddyAlludu first look is fake. We will be releasing the original one in a week. Please do not share the fake one, original will be worth your wait!👍
— Maruthi dasari (@DirectorMaruthi) 1 July 2018
Comments
Please login to add a commentAdd a comment