‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బిజినెస్. నేను యాక్ట్ చేసిన సినిమాల నిర్మాతలకు డబ్బు రావాలని కోరుకుంటాను. నా దృష్టిలో బాక్సాఫీస్ రిజల్ట్సే సక్సెస్‌కు కొలమానం. మంచి పేరు ఎవరికి కావాలి? డబ్బులు కావాలి. అంతే (నవ్వుతూ). నేను రియలిస్టిక్‌గా ఉంటాను. ఎవరికీ తాళం వేయను’’ అన్నారు సమంత. ఆమె నటించిన తాజా చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’కు ఇది రీమేక్. ఒరిజనల్‌ను డైరెక్ట్ చేసిన పవన్‌కుమార్‌నే దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు. శ్రీనివాస చిట్టూరి, బండారు రాంబాబు నిర్మించిన ఈ సినిమా గురువారం రిలీజవుతున్న సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు..
కన్నడ ‘యు టర్న్’ రిలీజ్‌కి ముందే ఆ స్క్రిప్ట్ గురించి విన్నాను. ఇలాంటి సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలని ఇక్కడ రీమేక్ చేశాం. థ్రిల్లర్ మూవీస్ ఏ భాషకైనా నప్పుతాయి. ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్‌కు కూడా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ∙కథే ఈ సినిమాకు ఈ హీరో. కథను ముందుకు తీసుకెళ్లడానికి మేం అందరం క్యారెక్టర్స్ చేశాం. భూమికగారితో సినిమా చేయడం ఓ మంచి ఎక్స్‌పీరియన్స్. క్లైమాక్స్‌లో ఆమె నటన సూపర్. ఈ సినిమా కోసం నేను హెయిర్ కట్ చేసుకోవాల్సి రావడం, అంతకుముందు నాకు ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది. ∙నా ‘యు టర్న్’, నా భర్త నాగచైతన్య సినిమా (శైలజారెడ్డి అల్లుడు) ఒకే రోజు విడుదలవుతాయని ముందు ఊహించలేదు. కానీ అలా కుదిరింది. డెస్టినీ. ఇద్దరం ఇంట్లో కూర్చొని రిపోర్ట్ కార్డ్ కోసం వెయిట్ చేస్తాం. ఒక మంచి భార్యగా ఆయన విజయం నాకెంతో అవసరం. ‘శైలజారెడ్డి అల్లుడు’ చూశాను. పండక్కి ఫుల్‌మీల్స్ లాంటి సినిమా. నా సినిమా వర్క్ చెన్నైలో జరగుతుండటం వల్ల ‘యు టర్న్’ని చైతూ ఇంకా చూడలేదు. ∙ఈ ఏడాదిలో నేను తీసుకున్న రిస్క్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. నేను విలేజ్ అమ్మాయిని కాదు. కానీ ‘రంగస్థలం’ సినిమాలో రామలక్ష్మీ పాత్ర చేశాను. ‘మహానటి’ సినిమాలో నాది టైటిల్ రోల్ కాదు. ‘అభిమన్యుడు’లోనూ మంచి పాత్ర చేశాను. ఈ ఇయర్ ఆనందంగా ఉంది.
ఈ ఏడాదిలానే భవిష్యత్‌లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే నా లక్ వెనకాల హార్డ్‌వర్క్ కూడా ఉంది. తెలుగులో డబ్బింగ్ చెప్పడం కష్టమే. కానీ కంటిన్యూ చేస్తాను. తమిళంలో కూడా సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను కంప్లీట్ యాక్టర్ కావాలనుకుంటున్నాను. ∙స్కూల్లో నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘యు టర్న్’ ప్రమోషనల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయడానికి స్కోప్ దొరికింది. మా స్కూల్ ఫ్రెండ్స్ కాల్ చేసి అభినందించారు. ∙ప్రతి సినిమాకీ ముందు చేసిన సినిమాల్లో లేని కొత్త ఛాలెంజ్‌ని తీసుకోవడానికి ఇష్టపడతాను. నా వర్క్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటాను కానీ సౌకర్యాలు కావాలని కోరుకోను. ప్రజెంట్ నేను సెక్యూర్డ్ ప్లేస్‌లో ఉన్నాను. సక్సెస్‌ల కోసం చాలా సినిమాలు చేయాలనే తాపత్రయం లేదు. ఎగై్జటింగ్ స్క్రిప్ట్ అయితే ఓకే. ∙పెళ్లి చేసుకున్నాక స్ట్రాంగ్ ఉమెన్‌గా తయారయ్యా. మంచి సపోర్ట్ ఉంది. పిల్లల కోసం డేట్ ఏదీ ఫిక్స్ చేయలేదు. దేవుడే ఫిక్స్ చేస్తాడు. ∙శివ నిర్వాణ దర్శకత్వంలో నేను, చైతూ చేయబోతున్న సినిమా అక్టోబర్ 6న స్టార్ట్ అవుతుంది. అదే రోజు మా పెళ్లి రోజు. ఆ డే స్పెషల్ ఇదే (నవ్వుతూ). మరో సినిమా కమిట్ అయ్యా. త్వరలో ఆ విశేషాలు చెబుతాను.
నేనెవరికీ తాళం వేయను
Published Wed, Sep 12 2018 12:23 AM | Last Updated on Wed, Sep 12 2018 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment