
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వటంతో పాటు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ట్వీట్ చేసి ఫోటోపై సమంత ఆసక్తికరంగా స్పందించారు. ఓ వ్యక్తి సమంతను పెళ్లి చేసుకున్నట్టుగా గ్రాఫిక్స్ లో ఎడిట్ చేసిన ఫొటోను అల్లు అర్జున్ అడిక్ట్ (Allu Arjun Addict) అనే ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి ఏంటిది..? అంటూ కామెంట్ చేశారు..?
ఈ ఫొటోపై స్పందించిన సమంత ‘తొలి చూపులోనే ప్రేమించుకున్నాం, వారం క్రితం పారిపోయాం. ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. సమంత ఇచ్చిన రిప్లై పై సినీ ప్రముఖులు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ఇటీవల యు టర్న్, సీమరాజ సినిమాల షూటింగ్‌ను పూర్తి చేసిన సమంత, సూపర్ డీలక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
Eloped last week .. don’t know how this leaked .. It was love at first sight https://t.co/wJxvLBXbCc
— Samantha Akkineni (@Samanthaprabhu2) 29 July 2018
Comments
Please login to add a commentAdd a comment