సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయాక మరోలా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన వ్యవహారశైలికి కొన్నిసార్లు ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోవాల్సిందే. యూటర్న్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు అందితే జుట్టు, అంతకపోతే కాళ్లు పట్టుకోవడం అలవాటే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని, నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించిన చంద్రబాబు తాజాగా బీజేపీలోకి కలిసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ఎన్నికలు సమయం లో రాహుతల్‌తో పొత్తు కోసం మోదీని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్ర బాబు రాజకీయంగా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీకి దగ్గర కావాలని తహతహలాడుతున్నారు. కేంద్రం విభేదించి తప్పు చేశామంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బీజేపి ఇంచార్జ్ సునీల్ దియోధరా మాత్రం బాబు ఎంట్రీకి ఎప్పుడో గేట్లు మూసేశామని చెబుతున్నారు. అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు, లాబీయింగ్ మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే వుందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.
యూటర్న్ విషయానికి వస్తే...
2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు... 2019 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకతను పక్కనపెట్టి ఆ పార్టీతో చేతులు కలిపారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆయన వేసిన పిల్లిమొగ్గలతో సొంత పార్టీ నేతలే అయోమయానికి గురయ్యారు. ఇక నాలుగున్నరేళ్లుగా బీజేపీతో పనిచేసిన చంద్రబాబు ఎన్నికల ముందు హఠాత్తుగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసి హోదాపై యూ టర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి తానే పోరాటం చేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చిన ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు.
అలాగే తాను అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టులు అప్పచెప్పి..సకాలంలో పూర్తి చేసిన వారిని భారీ బహిరంగ సభ పెట్టి మరీ సన్మానించిన చంద్రబాబే... పవర్ పోయి ప్రతిపక్ష నేతగా మారగానే యూ టర్న్ తీసేసుకున్నారు. చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందంటూ హడావుడి చేసేస్తున్నారు. గతంలో చైనా ప్రభుత్వం సహాయంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తో రాజధాని భవనాలను నిర్మిస్తున్నామని ఆ దేశంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు చంద్రబాబు. చైనా ప్రతినిధులకు కూడా అమరావతి వచ్చి వెళ్లిపోయారు.
యూటర్న్‌కు... బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం. నాలుగు నెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభాని తప్ప జనానికి ఉపయోగపడేది కాదనేది వాస్తవం. యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని ,సహజత్వాన్ని వదులుకునేలా చంద్రబాబు ప్రవర్తిస్తుండటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. ఈ లెక్కన చూస్తుంటే...యూటర్న్‌ను ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment