
స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. తన సినిమాల అప్‌డేట్స్ తో పాటు సరదా సంగతలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటారు. తాజాగా సామ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ట్విటర్‌లో ఓ వ్యక్తి తన తాతయ్య రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ‍్మ పాట పాడిన వీడియోను సమంతను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ మీ పాట పాడుకుంటున్నారు. తాతయ్య రాకింగ్. అద్భుతమైన పాట ఇచ్చినందకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన సమంత ‘మేడ్ మై డే’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం యూటర్న్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సామ్, త్వరలో నాగచైతన్యతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు.
😂😂😂made my day https://t.co/QMhN4UHhWj
— Samantha Akkineni (@Samanthaprabhu2) 26 May 2018