‘యు ట‌ర్న్’కు డేట్‌ ఫిక్స్‌ | Samantha U Turn Release On 13th September | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 28 2018 3:48 PM | Last Updated on Tue, Aug 28 2018 3:49 PM

Samantha U Turn Release On 13th September - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ డిఫరెంట్‌ రోల్‌ నటిస్తున్న సినిమా యు టర్న్‌. కన్నడలో సూపర్‌ హిట్ అయిన యు టర్న్‌ కు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పవన్‌ కుమార్‌ దర్శకుడు. ఇప్పటికే విడుద‌లైన యు ట‌ర్న్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళభాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. యువ నటుడు రాహుల్ ర‌వీంద్రన్, సీనియర్ హీరోయిన్‌ భూమికా చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పూర్ణ చంద్ర తేజ‌స్వి సంగీతమందిస్తుండగా శ్రీ‌నివాస సిల్వర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement