ఆ ఆఫర్‌కు నో చెప్పిన సమంత! | Actress Samantha Rejected Bollywood Offers | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు నో చెప్పిన సమంత 

Published Sun, Dec 15 2019 9:03 AM | Last Updated on Sun, Dec 15 2019 12:53 PM

Actress Samantha Rejected Bollywood Offers - Sakshi

దక్షిణాది హీరోయిన్లకు బాలీవుడ్‌లో అవకాశం అనేది ఒక కల అనే చెప్పవచ్చు. ఇక్కడ టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నా, హిందీ చిత్రాల్లో నటించాలని ఆశపడుతుంటారు. అందుకు కారణం బాలీవుడ్‌ చిత్ర పరిధి వేరు. అంతేకాదు క్రేజ్‌తో పాటు మార్కెట్‌ పెరుగుతుంది. అలా ఇక్కడ స్టార్స్‌గా రాణిస్తున్న నటి త్రిష, శ్రియ వంటి హీరోయిన్ల బాలీవుడ్‌లో పాగావేయాలని ప్రయత్నించినా, అక్కడ గుర్తింపు పొందలేకపోయారు. నటి తాప్సీ మాత్రం దక్షిణాది క్రేజ్‌తో బాలీవుడ్‌లో అవకాశాలను అందుకుని అక్కడ సెటిల్‌ అయ్యింది. నటి నయనతార, అనుష్క వంటి వారికి బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చినా తమకు దక్షిణాది చాలు అంటూ నో చెప్పేశారు. ఇప్పుడు నటి సమంత కూడా వీరి కోవలోకి చేరిందనే ప్రచారం సాగుతోంది. సమంత చేతిలో ఇప్పుడు 96 అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. అదీ దాదాపు పూర్తి అవుతున్న దశలో ఉంది. 

కాగా ఇంతకుముందు ఈ బ్యూటీ యూ టర్న్‌ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళం రీమేక్‌లో సమంత కోరి మరీ నటించింది. కాగా అదే చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్‌ కానుంది. ఇందులో సమంతకే నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆ అవకాశాన్ని ఈ బ్యూటీ నిరాకరించినట్లు సమాచారం. అలా బాలీవుఢ్‌ ఎంట్రీని కాదన్న సమంత గురించి ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది. అయితే తను ఎంతో కోరుకుని నటించిన యూటర్న్‌ చిత్రం అంత ఆశించిన విజయాన్ని సాధించలేదన్న నిరాశతో ఆ అవకాశాన్ని కాదందా లేక బాలీవుడ్‌లో నటించడం ఇష్టం లేక నో అన్నదా అన్న చర్చ మాత్రం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement