
సమంత
యూ–టర్న్ తీసుకోవడానికి సమంత రాజమండ్రి వెళ్లారు. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్, రాధిక చేతన్, దిలీప్ రాజ్ ముఖ్య తారలుగా రూపొందిన కన్నడ చిత్రం ‘యూ–టర్న్’. ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సమంత లీడ్ రోల్ చేస్తోన్న ఈ సినిమాకి పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ శనివారం రాజమడ్రిలో ప్రారంభమైంది. అయితే.. సమంతను చూడటానికి చాలా మంది అభిమానులు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడంతా కోలాహలం నెలకొంది. వారి అభిమానానికి ఫిదా అయ్యారు సమంత. ‘‘యూ–టర్న్’ సినిమా స్టారై్టంది. అభిమానుల ప్రేమ నన్ను మరింత ప్రోత్సహిస్తోంది. మూవీని మరింత బాగా తీయడంలో నాకు ప్రేరణ కల్పిస్తోంది’’ అని పేర్కొన్నారు సమంత.
Comments
Please login to add a commentAdd a comment