వదిన కాస్త...దెయ్యం అవుతోంది! | Bhumika Acts As A ghost In New Movie | Sakshi
Sakshi News home page

వదిన కాస్త...దెయ్యం అవుతోంది!

Mar 22 2018 12:20 PM | Updated on Jul 14 2019 4:54 PM

Bhumika - Sakshi

భూమిక (ఫైల్‌)

ఎంసీఏ సినిమాలో వదినగా భూమిక హుందాగా నటించింది.  సినిమా మొత్తం భూమిక చుట్టే తిరుగుతుంది. భూమిక తన నటన, హావభావాలతో పాత్రకు న్యాయం చేసింది. రీ ఎంట్రీ తర్వాత భూమికకు చాలా ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 

కన్నడ సినిమా ‘యూ టర్న్‌’ రీమేక్‌లో కీలక పాత్రలో భూమిక నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో భూమిక దెయ్యం పాత్రలో కనిపించబోతోందట. మరి వదినగా అదరగొట్టిన భూమిక, దెయ్యం పాత్రలోనూ అదే రేంజ్‌లో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. కన్నడలో డైరెక్ట్‌ చేసిన పవన్‌కుమార్‌ తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటింస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement