
రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి హ్యాట్రిక్ హిట్‌లతో దూసుకెళ్తున్నారు సమంత. ఈ ఏడాది ప్రథమార్దం సమంతకు కలిసి వచ్చింది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సమంత.. ద్వితీయార్దంలో కూడా సక్సెస్ సాధించడానికి రెడీ అవుతున్నారు.
కన్నడ హిట్ మూవీ యూ టర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో సమంత రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, భూమిక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 17న, సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కన్నడ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు.
Trailer launch on the 17th of this month 😊Hope you guys are excited. Promising an edge of your seat thriller . A lucky few will be among the first to watch the trailer with us. @pawanfilms @AadhiOfficial @23_rahulr @SS_Screens @UTurnTheMovie #UTurnonSept13 #UTurnTrailerOnAug17 pic.twitter.com/20oX3v6Umi
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 11, 2018
Comments
Please login to add a commentAdd a comment