Vijay Deverakonda And Samantha Kushi Movie Trailer Release Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

Kushi Movie Trailer Update: సమంత, విజయ్‌ 'ఖుషి'.. క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!

Published Mon, Aug 7 2023 4:54 PM | Last Updated on Mon, Aug 7 2023 6:18 PM

Vijay Deverakonda and Samantha Kushi trailer to release on August 9 - Sakshi

విజయ్ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'ఖుషి'. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే  షూటింగ్  పూర్తి  చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ  నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తేదీని రివీల్ చేశారు.

(ఇది చదవండి: రాహుల్‌ గాంధీపై మనసు పారేసుకున్న బోల్డ్ బ్యూటీ!)

ఈనెల 9వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
దీంతో ఖుషి ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు. ఈ చిత్రంలో  జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇది చదవండి: 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement