
మహానటి సినిమాలో సావిత్రి పరిచయ సన్నివేశానికి అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా గ్లిజరిన్ లేకుండానే సావిత్రి ఒక కంటి నుంచి కన్నీరు కార్చినట్టుగా తెరకెక్కించిన ఈ సన్నివేశానికి థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. అయితే ఇలాంటి సంఘటనే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యు టర్న్’ సినిమా సెట్‌లో జరిగింది.
ఈ విషయాన్ని నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు యాక్షన్ చెప్పగానే ఎలాంటి గ్లిజరిన్ లేకుండానే సమంత కన్నీళ్లు కార్చేసిందట. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన రాహుల్ ట్విటర్‌లో తన అనుభవాన్ని వివరించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ సినిమా తెలుగులో సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు.
Our director just has to call action and this girl @Samanthaprabhu2 can sob her heart out on cue... and how! No glycerin nothing. Sammo... cut! 😄😄🙌🏽🙌🏽 #UTurn
— Rahul Ravindran (@23_rahulr) 23 May 2018
Comments
Please login to add a commentAdd a comment