సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మంచి వసూళ్లు సాధిస్తుండటంతో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత , డైరెక్టర్ నందినిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘సినిమాని ఇంత హిట్ చేసినందుకు అందరికి థాంక్స్.. మీడియాకి, రివ్యూయర్స్‌కి చాల చాల కృతజ్ఞతలు. నేను చేసిన సినిమాల్లో ఇంత పాజిటివ్ రివ్యూస్ రావడం, అది కూడా నా యాక్టింగ్‌కి రావడం చాల ఆనందంగా ఉంది.. ఇక్కడికి వచ్చిన కవిత గారికి, డైరెక్టర్ నందికి గారికి చాల థాంక్స్’అన్నారు.
కల‍్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ‘వండర్ ఫుల్ సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాల బాగా ఉంది అంటున్నారు. సమంత ఈ సినిమాలో చాల డిఫరెంట్‌గా కనిపించింది. రంగస్థలంలో , యూ టర్న్ లో చాల వేరియేషన్స్ చూపించింది. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాల మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ’ అన్నారు. ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment