
ఈ ఏడాది ప్రథమార్థం సమంతకు బాగా కలిసొచ్చింది. కేవలం సినిమాలు విజయవంతం కావడమే కాదు.. నటిగానూ ఎంతో పేరు వచ్చింది. రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా అలరించిన సమంత, మహానటిలో మధుర వాణీ పాత్రలో జీవించారు. ఇవి రెండూ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలే. రీసెంట్‌గా వచ్చిన అభిమన్యుడు సినిమా కూడా విజయవంతంగా దూసుకెళ్తోంది.
మరి ద్వితీయార్థం సమంతకు ఎలా ఉంటుందో చూడాలి. సెకండాఫ్ కూడా విజయాలను ఇస్తుందని చాలా నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు సమంత. ఇదే విషయమై సమంత స్పందిస్తూ.. ‘తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా..... ఫస్ట్ హాఫ్ సక్సెస్ అయినట్లు సెకండాఫ్ కూడా ఉండబోతోంది... యూ టర్న్ మూవీకి డబ్బింగ్ మొదలైంది’ అంటూ ట్వీట్ చేశారు. కన్నడ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
The calm before the storm !! Prepping for the second half of the year ,after an amazing first half 💪. #SuperDeluxe #Uturn #Seemaraja Dubbing begins !! pic.twitter.com/bKZ7YS4Enp
— Samantha Akkineni (@Samanthaprabhu2) June 7, 2018
Comments
Please login to add a commentAdd a comment