Samantha Starts Shaakuntalam Movie Dubbing Work Shared Photo - Sakshi
Sakshi News home page

Samantha: నా పిచ్చికి, బాధకు అదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్‌

Published Fri, Jan 6 2023 2:11 PM | Last Updated on Fri, Jan 6 2023 2:55 PM

Samantha Starts Shaakuntalam Movie Dubbing Work Shared Photo - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నానని చెప్పి అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైంది. ఆస్పత్రి బెడ్‌పైనే యశోద మూవీకి డబ్బింగ్‌ చెప్పింది సమంత. ఇక ఆమె లేటెస్ట్‌ మూవీ శాకుంతలం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబతోంది. ఈ నేపథ్యంలో సమంత శాకుంతలంలో తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్‌లోనే తొలి రికార్డు!

శాకుంతలం సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్న ఫొటో షేర్‌ చేస్తూ ఆసక్తికరంగా క్యాప్షన్‌ ఇచ్చింది. ‘నా పిచ్చికి, బాధకు, ప్రపంచంలో కోల్పోయిన వాటన్నింటికి ఈ కళనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యానికి చేరుకుంటాను’ అని రచయిత నిక్కీ రో రాసిన కోట్‌ను ఈ సందర్భంగా పంచుకుంది. ఈ పోస్ట్‌ చూస్తుంటే సమంత ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇవాళ ముంబై ఎయిర్‌పోర్టులో వైట్‌ సూట్‌ ట్రెండీ డ్రెస్‌లో సామ్‌ దర్శనమిచ్చింది. ఈ లుక్‌ చూసి ఆమె ఫాలోవర్స్‌ లేడీ బాస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement