మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' మూవీనే. ఆమె ఒట్టయల్ పట్టాలమ్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఆశించినా ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోవడంపై ఆమె తొలిసారి స్పందించారు.
(ఇది చదవండి: సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!)
మధుబాల మాట్లాడుతూ.. 'కష్టపడి పనిచేసినప్పటికీ శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టింది. సినిమా పూర్తయిన తర్వాత ఒక ఏడాది సీజీఐ కోసమే వర్క్ చేశారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్‌లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదు. టాలీవుడ్ చిత్రాలు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ గొప్ప విజయాలు సాధించాయి. వాటి విజయాలకు సరైన కారణం అంటూ ఏదీ లేదు. అవీ ఎలా హిట్ అయ్యాయో అర్ధం కావట్లేదు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అనుకోలేదు.' అని అన్నారు.
కాగా.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రల్లో నటించారు.
(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుంది: హాలీవుడ్ టాప్ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment