madhoo
-
రోజా సూపర్ హిట్.. డైరెక్టర్‌కు ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి?: హీరోయిన్
ప్రతి నటీనటుడి జీవితంలో కొన్ని మర్చిపోలేని సినిమాలుంటాయి. వారి కెరీర్‌ను అందలమెక్కించిన చిత్రాలను అంత ఈజీగా మర్చిపోలేరు. అలా సీనియర్ హీరోయిన్ మధుబాల జీవితంలో 'రోజా' మూవీ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1992లో వచ్చిన ఈ సినిమాను మణిరత్నం అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందుకే అది అప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. ఆయనంటే నాకు గౌరవం.. కానీ.. అయితే ఈ మూవీ తర్వాత దర్శకుడితో స్నేహపూర్వకంగా మసులుకోలేదట మధుబాల. తన యాటిట్యూడ్‌తో అందరినీ దూరం పెట్టిందట. రోజా క్రెడిట్‌ను కూడా అతడికి ఇవ్వలేదట. అందుకు ఇప్పుడు బాధపడుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మణి సర్ అందరితోనూ బాగానే ఉండేవారు. అతడితో టచ్‌లో ఉండేందుకు చాలాసార్లు ప్రయత్నించాను.. మెసేజ్‌లు పంపాను. ఆయనంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం. యాటిట్యూడ్ చూపించా.. కానీ రోజా మూవీ రిలీజైన సమయంలో ఇలా లేను. ఆయన నాకేం ఫేవర్ చేశాడని? తనకు రోజాలాంటి అమ్మాయి కావాలి.. నాలో రోజాను చూసుకున్నాడు కాబట్టి నన్ను తన సినిమాకు తీసుకున్నాడు. అంతేగా.. అందులో ప్రత్యేకత ఏముంది? ఇలా ఆటిట్యూడ్ చూపించేదాన్ని. నేను పడ్డ బాధలో నుంచే ఈ అహంకారం, కోపం పుట్టుకొచ్చాయి. ఎందుకంటే నా కెరీర్లో ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. మేకప్ దగ్గరి నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నేనే రెడీ చేసుకునేదాన్ని. ఒక్కదాన్నే అంతా చేసుకున్నాను. అందుకే ఎవరికైనా గుర్తింపు ఇవ్వడానికి మనసొప్పేది కాదు. స్నేహపూర్వకంగా మసులుకోలేదు.. అందుకే! కానీ మణిరత్నం సర్‌కు ఆ గుర్తింపు, ప్రశంసలు దక్కాల్సిందే! అప్పుడు చెప్పలేకపోయాను.. కానీ ఇప్పుడు చెప్తున్నాను. నాకు గుర్తింపును తీసుకువచ్చిందే ఆయన.. ఆయనకు క్రెడిట్ దక్కాల్సిందే! నేను తనతో స్నేహపూర్వకంగా మెదులుకోలేదు.. అనుబంధాన్ని కొనసాగించలేదు.. అందుకే ఆయన తర్వాతి సినిమాల్లో నన్ను తీసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా మధు చివరగా శాకుంతలం సినిమాలో నటించింది. అలాగే స్వీట్ కారం కాఫీ అనే తమిళ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. చదవండి: నటుడితో రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైరల్ -
వైట్ శారీలో కాబోయే మెగా కోడలు.. మిల్కీ బ్యూటీ హాట్ పోజులు!
►వైట్ శారీలో కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి లుక్స్! ►లస్ట్ స్టోరీస్-2 భామ తమన్నా హాట్ పోజులు! ►గురు పౌర్ణమి వేడుకల్లో పూనమ్ బజ్వా ►లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సీనియర్ నటి మధుబాల View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Madhoo Shah (@madhoo_rockstar) -
ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల
మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' మూవీనే. ఆమె ఒట్టయల్ పట్టాలమ్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఆశించినా ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోవడంపై ఆమె తొలిసారి స్పందించారు. (ఇది చదవండి: సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!) మధుబాల మాట్లాడుతూ.. 'కష్టపడి పనిచేసినప్పటికీ శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టింది. సినిమా పూర్తయిన తర్వాత ఒక ఏడాది సీజీఐ కోసమే వర్క్ చేశారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదు. టాలీవుడ్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ గొప్ప విజయాలు సాధించాయి. వాటి విజయాలకు సరైన కారణం అంటూ ఏదీ లేదు. అవీ ఎలా హిట్ అయ్యాయో అర్ధం కావట్లేదు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుంది: హాలీవుడ్ టాప్ డైరెక్టర్) -
ఆ రోజుల్లో పరిస్థితులు వేరు.. అందుకే తప్పుకున్నా: సినీయర్ నటి మధుబాల
మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తుకొస్తుంది. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా. ఆమె ఒట్టయల్ పట్టాలమ్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో సినిమాలోనే కె.బాలచందర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లింగవివక్షపై మధుబాలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన లింగవివక్ష, టైప్కాస్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకానొక సమయంలో తన నటనా జీవితం ముగిసే సమయానికి.. తనకు తగిన పాత్రలు లభించలేదని ఆమె చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అలియా భట్ ఆ పరిస్థితిని ఇండస్ట్రీలో పూర్తిగా మార్చేశారని మధు ప్రశంసించారు. టైప్క్యాస్ట్ గురించి మధు మాట్లాడుతూ..'నేను హీరోయిన్ పాత్రలే పోషించా. కాబట్టి ఆ సమయంలో హీరోయిన్లందరూ టైప్కాస్ట్ చేశారు. మాకు కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. డ్యాన్స్ చేశాం. వాటిలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చేశా. పలు భాషలలో వైవిధ్యమైన పాత్రలు పోషించా. దాని గురించి నాపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. నాకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించా. అప్పుడు ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించాలని అనుకున్నా. కానీ నాకు తగిన పాత్రలు రాలేదు.' అని చెప్పుకొచ్చారు. రోజా సినిమాలో నటించడంపై మధు మాట్లాడుతూ..'నేను చాలావరకు యాక్షన్ హీరోల సినిమాల్లో నటించా. వారిలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్‌లతో నటించా. యోధ, రోజా వంటి చిత్రాలు చేశా. దక్షిణాదిలో కూడా ఇలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా. కానీ అది జరగలేదు. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందులో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.' అని అన్నారు. దేవ్ మోహన్, గౌతమి, మధు, అదితి బాలన్, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటించిన శాకుంతలం చిత్రంలో మధు మేనక పాత్రలో కనిపించనుంది. కవి కాళిదాసు నాటకం అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈచిత్రం ఈనెల 14న థియేటర్లలో విడుదల కానుంది. -
ఇప్పటికీ నేను హీరోయిన్నే!!
అప్పుడెప్పుడో 1992లో వచ్చిన రోజా సినిమా గుర్తుందా.. అందులో హీరోయిన్గా చేసిన మధుబాల ఇప్పటికీ తాను హీరోయిన్నే అంటోంది. హీరోయిన్ అంటే 18-20 ఏళ్ల మధ్య వయసులోనే ఉండాల్సిన అసవరం లేదని ఆమె చెబుతోంది. హీరోయిన్ అంటే.. సినిమాలో ప్రధానపాత్ర పోషించే వాళ్లు అవుతారని, అలాంటప్పుడు మధ్యవయసు ఆడవాళ్లు హీరోయిన్లు ఎందుకు కాకూడదని మధుబాల ప్రశ్నించింది. సాధారణంగా తనలాంటి వాళ్లకు హీరో తల్లి లేదా హీరోయిన్ తల్లి పాత్రలే ఇస్తారని.. కానీ ఏదైనా సినిమాలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పుడు ఇస్తే తమను తాము నిరూపించుకోవడం పెద్ద కష్టం కాబోదని చెప్పింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలిరోజుల్లో ఎంత త్వరగా పని పూర్తిచేసి, ఎంత త్వరగా ఇంటికి వెళ్దామా అని ఉండేదని.. కానీ ఇప్పుడు కన్నడంలో చేస్తున్న 'రాణా' సినిమా తన ఆలోచననే మార్చేసిందని మధుబాల చెప్పింది. రెండేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధుబాల.. ఇప్పటికి దక్షిణాదిలో 3 సినిమాలే చేసింది. మణిరత్నం దర్శకత్వంలో అయితే తాను ఏ పాత్ర అయినా చేయగలనన్న నమ్మకం ఉందని మధు చెప్పింది. తాను సినిమాల్లోకి మళ్లీ వచ్చిన తర్వాత.. మణిరత్నం కంటే ఎవరూ మంచిపాత్ర ఇవ్వలేరని ఆమె అంటోంది. అవకాశం వస్తే నెగెటివ్ పాత్రలు చేయడానికైనా తాను సిద్ధమేనంటోంది.