ఇప్పటికీ నేను హీరోయిన్నే!!
అప్పుడెప్పుడో 1992లో వచ్చిన రోజా సినిమా గుర్తుందా.. అందులో హీరోయిన్గా చేసిన మధుబాల ఇప్పటికీ తాను హీరోయిన్నే అంటోంది. హీరోయిన్ అంటే 18-20 ఏళ్ల మధ్య వయసులోనే ఉండాల్సిన అసవరం లేదని ఆమె చెబుతోంది. హీరోయిన్ అంటే.. సినిమాలో ప్రధానపాత్ర పోషించే వాళ్లు అవుతారని, అలాంటప్పుడు మధ్యవయసు ఆడవాళ్లు హీరోయిన్లు ఎందుకు కాకూడదని మధుబాల ప్రశ్నించింది. సాధారణంగా తనలాంటి వాళ్లకు హీరో తల్లి లేదా హీరోయిన్ తల్లి పాత్రలే ఇస్తారని.. కానీ ఏదైనా సినిమాలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పుడు ఇస్తే తమను తాము నిరూపించుకోవడం పెద్ద కష్టం కాబోదని చెప్పింది.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలిరోజుల్లో ఎంత త్వరగా పని పూర్తిచేసి, ఎంత త్వరగా ఇంటికి వెళ్దామా అని ఉండేదని.. కానీ ఇప్పుడు కన్నడంలో చేస్తున్న 'రాణా' సినిమా తన ఆలోచననే మార్చేసిందని మధుబాల చెప్పింది. రెండేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధుబాల.. ఇప్పటికి దక్షిణాదిలో 3 సినిమాలే చేసింది.
మణిరత్నం దర్శకత్వంలో అయితే తాను ఏ పాత్ర అయినా చేయగలనన్న నమ్మకం ఉందని మధు చెప్పింది. తాను సినిమాల్లోకి మళ్లీ వచ్చిన తర్వాత.. మణిరత్నం కంటే ఎవరూ మంచిపాత్ర ఇవ్వలేరని ఆమె అంటోంది. అవకాశం వస్తే నెగెటివ్ పాత్రలు చేయడానికైనా తాను సిద్ధమేనంటోంది.