సమంత ప్రధాన పాత్రలో ‘యూ టర్న్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు(ఆగస్టు 17 ) విడుదల చేశారు. నేనిలా బార్ కౌంటర్‌లో ఇన్ని శబ్దాల మధ్య... అంటూ సమంత వాయిస్‌తో మొదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో సమంత పాత్రికేయురాలిగా నటిస్తున్నారు. ఆర్కే పురం ఫ్లై ఓవర్ పై జరిగిన ఆక్సిడెంట్లకు సంబంధించిన విషయాల గురించి ఇన్వెస్టిగేట్ చేసేందుకు సమంత పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, ఆ ప్రమాదాలకు సమంతే కారణం అంటూ పోలీసులు ప్రశ్నించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.