
పెళ్లి తరువాత అక్కినేని నాగచైతన్య, సమంతలు తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు. అంతేకాదు పెళ్లి పనుల కారణంగా పక్కన పెట్టేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ను తిరిగి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నాగచైతన్య సవ్యసాచి షూటింగ్ లో బిజీ అయ్యారు. మారుతి దర్శకత్వంలో మరో సినిమాను రెడీ చేస్తున్నారు. సమంత కూడా రంగస్థలంతో పాటు ఓ తమిళ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు.
అయితే పెళ్లి ముందే నిర్మాతగా మారేందుకు ప్లాన్ చేసుకున్న సమంత ఆ ప్లాన్స్ కు కొంత కాలం బ్రేక్ ఇచ్చారు. తాజాగా మరోసారి నిర్మాతగా మారే ప్రయత్నాలు ప్రారంభించారట. గతంలో అనుకున్నట్టుగానే కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ సినిమాతోనే నిర్మాతగా మారేందుకు రెడీ అవుతోంది సామ్. అయితే ఈ సారి నిర్మాణం విషయంలో మామయ్య నాగ్ సలహాలు కూడా తీసుకోనుందట. కన్నడలో లూసియా ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ నటించలేదు. అయినా మౌత్ టాక్తో మంచి వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.