
సమంత ప్రధాన పాత్రలో ‘యూ టర్న్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు(ఆగస్టు 17 ) విడుదల చేశారు. నేనిలా బార్ కౌంటర్‌లో ఇన్ని శబ్దాల మధ్య... అంటూ సమంత వాయిస్‌తో మొదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో సమంత పాత్రికేయురాలిగా నటిస్తున్నారు. ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగిన ఆక్సిడెంట్లకు సంబంధించిన విషయాల గురించి ఇన్వెస్టిగేట్ చేసేందుకు సమంత పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, ఆ ప్రమాదాలకు సమంతే కారణం అంటూ పోలీసులు ప్రశ్నించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
కాగా కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సమంతతో పాటు భూమిక ఓ కీలకపాత్రలో నటిస్తుండగా మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కన్పించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న యూ టర్న్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment