
సాఫీగా సాగిపోతున్న జీవితంలో అనుకోని సంఘటన జరిగి, ఇబ్బందులు ఏర్పడితే లైఫ్ ఒక్కసారిగా ‘యు టర్న్’ అయింది అంటాం. అదే యు టర్న్ ఓ సినిమాకి కీలకమైంది. తప్పు దోవలో యు టర్న్ తీసుకున్నవాళ్లు చనిపోతుంటారు. చంపుతున్నది ఎవరు? అనే పాయింట్‌తో రూపొందిన కన్నడ చిత్రం ‘యు టర్న్’. అదే టైటిల్‌తో సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేశారు. పవన్‌కుమార్ దర్శకుడు.
ఈ చిత్రం ట్రైలర్‌కు తెలుగు, తమిళ భాషల్లో 65 లక్షల వ్యూస్ వచ్చాయి. రెండు భాషల్లోనూ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 13న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నికేత్ బొమ్మి íసినిమాటోగ్రాఫర్, పూర్ణచంద్ర తేజస్వి స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment